గద్వాల: జూరాలకు కొనసాగుతున్న వరద

64చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం పరిధిలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ఎగువ నుంచి ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతూ తగ్గుతూ వస్తుంది. నారాయణపూర్ నుంచి ప్రతిరోజు 10 నుంచి 20 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు శుక్రవారం తెలిపారు. గరిష్ఠ సామర్థ్యానికి నీరు చేరుకున్న నేపథ్యంలో సాగునీటిని విడుదల చేయాలని ప్రాజెక్టు ఈఈ జగన్ మోహన్ ను ఆయకట్టు రైతులు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్