కేటీదొడ్డి మండలం మల్లాపురానికి చెందిన కంబయ్య(40) శుక్రవారం రాత్రి ఇంటి నుండి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. ఎంతసేపటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా గ్రామంలోని ఒక ఇంటి సమీపంలో అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్నాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటన స్థలానికి వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కంబయ్య భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాసులు శనివారం తెలిపారు.