భారత రాజ్యాంగ హక్కుల రక్షణ కోసం జులై 9 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ గద్వాల్ జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ పిలుపునిచ్చారు. శనివారం గద్వాలలో హమాలీలతో కరపత్రాలు పంపిణీ చేశారు. నాలుగు లేబర్ కోడ్లు, 12 గంటల పని, సమ్మె నిషేధం, సామాజిక భద్రత నిధుల కోతతో కార్మిక హక్కులు కాలరాస్తున్నాయని విమర్శించారు.