
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
AP: ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఫస్టియర్లో 70 శాతం, సెకండియర్లో 83 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్ సెకండియర్లో బాలుర ఉత్తీర్ణత శాతం 80 ఉంటే.. బాలికలది 86 శాతంగా ఉంది. ఫస్టియర్లో బాలురు 66 శాతం ఉత్తీర్ణులైతే.. బాలికలు 75 శాతంతో ముందు వరుసలో ఉన్నారు.