గద్వాల: దారుణం... గొంతు నులిమి హతమార్చిన ట్రాన్స్ జెండర్స్

54చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ కు చెందిన రామకృష్ణ (25) అనే యువకుడును తనతో కలిసి తిరగడం లేదనే నెపంతో, ఫోన్ మాట్లాడడం లేదని గద్వాలకు చెందిన ట్రాన్స్ జెండర్ శివాణి తోపాటు మరో ముగ్గురు ట్రాన్స్ జెండర్స్ కలిసి శుక్రవారం యువకుడి ఇంట్లో ప్రవేశించి తలుపులు వేసి నోట్లో గుడ్డలు కుక్కి, గొంతు నులిమి, విచక్షణ రహితంగా దాడి చేశారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో గమనించిన ట్రాన్స్ జెండర్స్ ఓ వాహనంలో జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే రామకృష్ణ మృతి చెందాడని వైద్యులు చెప్పడంతో ట్రాన్స్ జెండర్స్ పారిపోవడం జరిగిందని రామకృష్ణ బంధువులు ఆరోపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్