

నటుడుకి ప్రభాస్ సాయం అంటూ ప్రచారం.. మొత్తం ఫేక్ (వీడియో)
తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటుడు ఫిష్ వెంకట్‌కు హీరో ప్రభాస్ సహాయం చేస్తున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. ఈ మేరకు ప్రభాస్ అసిస్టెంట్ ఒకరు ఫోన్ చేసి చికిత్స ఖర్చులు భరిస్తామన్నారని వెంకట్ కుమార్తె పేర్కొన్నారు. అయితే, ఆ తర్వాత ఆ వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, వాస్తవంగా అతడు ప్రభాస్ అసిస్టెంటేనా అనే అనుమానాలు ఉన్నాయని.. అందంతా ఫేక్ అని చెప్పారు. ఈ పరిస్థితిలో సాయం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.