గద్వాల: ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేయాలి

57చూసినవారు
గద్వాల: ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేయాలి
జోగులాంబ గద్వాల జిల్లాలో ఫిట్నెస్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సులను సీజ్ చేయాలని పివైఎల్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బీరెల్లి దానయ్య, హరీశ్ పేర్కొన్నారు. గురువారం జిల్లా రవాణాశాఖ అధికారి వెంకటేశ్వరరావును కలిసి వినతి పత్రం సమర్పించారు. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల బస్సులకు మే చివరి నాటికి ఫిట్నెస్ చేయించుకోవాల్సి ఉండగా నేటికీ కొన్ని బస్సులకు ఫిట్నెస్ చేయించుకోలేదని, వాటిని గుర్తించి సీజ్ చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్