ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని మొక్కజొన్న చేను దగ్ధమైన ఘటన మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం. మల్దకల్ మండలం చిప్పదొడ్డికి చెందిన విట్టలాపురం అక్బర్ మొక్క కొయ్యలకు నిప్పు అంటించాడు. సాయంకాలం వీచిన గాలి దుమారానికి ఒక్కసారిగా మంటలు ఎగబాకి రవీంద్రకు చెందిన 3 ఎకరాల మొక్క జొన్న చేను కాలి బూడిదయ్యింది. దీంతో రైతుకు డ్రిప్పు చేనుతో కలిసి రూ. 4 లక్షల వరకు నష్టం వాటిల్లింది.