జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం కుర్తిరావల చెరువు గ్రామ శివారులో ఓ వ్యవసాయ పొలంలో సబ్ ఆర్గనైజర్ కు చెందిన సీడ్ విత్తనాలను బుధవారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ విత్తనాలు 12 క్వింటాల్ 75 కేజీల ఉన్నాయని, సుమారు 3 లక్షలకు పైగా విలువ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.