భూమిని కబ్జా చేస్తున్నారని మనస్తాపం చెందిన ఓ రైతు పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన రంగాపురం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితుడిని గద్వాల ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందన లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.