Top 10 viral news 🔥


ఆస్తి కోసం కూతురిని చంపిన సవతి తల్లి.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
TG: మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్తికోసం సవతితల్లే కూతురిని హత్య చేసింది. సవతితల్లి లలిత, తన మేనమామ రవి, స్నేహితుడు వీరన్నలతో కలిసి మహేశ్వరి (26)ని హత్య చేసింది. పెళ్లి కానుకగా మహేశ్వరీ తండ్రి ఇల్లు ఇవ్వబోతున్నారన్న కోపంతో గత డిసెంబర్ 7న చున్నీతో గొంతు బిగించి హత్య చేసి, మృతదేహాన్ని వంగమర్తి వద్ద మూసీలో పాతిపెట్టారు. ఈ నెల 2న తండ్రి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు ముగ్గురు నిందితులను రిమాండ్కు తరలించారు.