గద్వాల: జూరాల ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద

83చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల పరిధిలోని జూరాల ప్రియదర్శిని ప్రాజెక్ట్ కు ఎగువన కురుస్తున్న వర్షాల వలన వరద కొనసాగుతుంది. ఆదివారం సాయంత్రం ఇన్ ఫ్లో 21 వేలు, ఔట్ ఫ్లో 17, 676 క్యూసెక్కులు గా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318. 516 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 316. 500 మీటర్లు. పూర్తి స్థాయి నీటి నిల్వ 9. 657 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటినిల్వ 6. 081 టీఎంసీలు ఉంది. విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్