జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో ప్రజా పాలన సేవ కేంద్రంలో రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 14వరకు తీసుకుంటామని శుక్రవారం ఎంపీడీఓ ఆంజనేయ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ తిరుపతిరెడ్డిలు తెలిపారు. నిరుద్యోగుల యువకులకు రాజీవ్ యువ వికాసంకు దరఖాస్తు చేసుకునేందుకు మూడు రోజుల సమయం మాత్రమే ఉన్నది అన్నారు. ఇంకా చేసుకొని వారు ఎవరన్నా ఉన్నట్టయితే త్వరలోనే చేసుకోవాలని తెలియజేశారు.