జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ వాసి రామకృష్ణ శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. గతంలో రామకృష్ణతో ట్రాన్స్ జెండర్ శ్రీవాణితో పాటు మరికొంత మంది చనువుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారంతా కలిసి రీల్స్, వీడియో షూట్ కూడా చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు వెల్లడించారు. కాగా రామకృష్ణను ట్రాన్స్ జెండర్లే చంపారంటూ ఆయన భార్య ఆరోపించారు. ఈ కేసు శనివారం దర్యాప్తును వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు.