జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కొత్త ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో వర్షపు నీరు నిలిచిపోయి శనివారం చెరువును తలపిస్తుంది. వర్షం కురిసిన ప్రతిసారి నీరు నిలిచిపోయి చెరువులా మారుతోందని, ఈ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్ లో బస్సుల కోసం వేచి ఉన్న ప్రయాణికులకు దోమలు, దుర్వాసన కూడా వస్తు ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.