నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరుడు పండుగ సాయన్న ముదిరాజ్ చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని తెలుగు ముదిరాజ్ సంఘం జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు కబీరుదాసు నర్సింహులు అన్నారు. ఆదివారం సాయన్న జయంతిని పురస్కరించుకొని జిల్లెడు బండలో మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. భూమికోసం, భుక్తి కోసం, నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాటం చేసి అమరుడయ్యారని పేర్కొన్నారు.