విద్యారంగ సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టిఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా కో-ఆర్డినేటర్ కురవ పల్లయ్యకు సూచించారు. శనివారం హైదరాబాద్ తెలంగాణ భవన్ లో పల్లయ్య కేటీఆర్ ను కలిశారు. జిల్లాలో విద్యారంగ సమస్యలు, పార్టీ స్థితిగతులపై చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు ప్రజలకు వివరిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించాలని కేటిఆర్ సూచించారు.