గద్వాల: ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి

71చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ ఢీకొని ఓ మహిళ మృతి చెందిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. బుధవారం స్థానిక వివరాల ప్రకారం. రాజోలి మండల కేంద్రానికి చెందిన సుగుణమ్మ భర్త శేఖర్ తో కలిసి ఆటోలో కర్నూల్ కు వెళ్లారు. మంగళవారం రాత్రి తిరిగి వస్తుండగా వేగంగా వచ్చిన ఇసుక ట్రాక్టర్ వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ చక్రానికి ఆమె చీర చిక్కుకుని కొంత దూరం వరకు ఈడ్చుకెళ్లింది. తీవ్ర గాయాలై ఆమె మృతిచెందింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్