జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో మంగళవారం సెల్ ఫోన్ దొంగతనం చేసే వ్యక్తిని మహిళలు చీపురుతో చితకబడిన ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం. బస్టాండ్ లో ఓ ప్యాసింజర్ కుర్చీలో పండుకొని ఉంటే జేబులో నుంచి ఫోన్ తీస్తుండగా ఆర్టీసీ బస్టాండ్ లో పనిచేసే సీపర్లు పట్టుకొని చితక బాధినారు. అనంతరం ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు.