మల్దకల్ మండల కేంద్రానికి చెందిన రామకృష్ణ (35) ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని మృతి చెందాడు. అతనికి భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. రామకృష్ణ గద్వాలకు చెందిన ఓ ట్రాన్స్ జెండర్‌తో పరిచయం ఉంది. ఆమె వేధింపులే ఆత్మహత్యకు కారణమని శుక్రవారం భార్య ఆరోపించింది. కుటుంబ కలహాల లేక ఇతర కారణాలా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.