జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జూలేకల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మ గాంధీ దేశానికి చేసిన సేవలను నాయకులు స్మరించుకుని ఆయన బాటలో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ, టెక్నికల్ అసిస్టెంట్, గ్రామ యువత, గ్రామ పెద్దలు తదితరులు హాజరయ్యారు.