గద్వాల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం జాబ్ మేళ నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియేట్ నోడల్ అధికారి హృదయ్ రాజ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2022 -2023 - 2024 సంవత్సరాలలో ఎస్ ఎస్ సి లో 60 శాతం, ఇంటర్ బైపిసి, ఎంపిసి లో 55 శాతం మార్కులు సాధించిన వారు అర్హులన్నారు. అర్హత కలవారు సంబంధిత ఒరిజినల్ అండ్ రెండు సెట్ల జిరాక్స్, ఆధార్ కార్డులు తీసుకుని రావాలని తెలిపారు.