జూరాలలో పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

62చూసినవారు
ఎగువన కరుస్తోన్న వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నారాయణపూర్ నుంచి భారీగా వస్తున్న వరద నీరు జూరాల గేట్లను దాటుకొని శ్రీశైలానికి పోటెత్తింది. జూరాలకు రాత్రి 10 గంటల వరకు ఇన్ ఫ్లో 1, 29, 000 క్యూసెక్కులకు చేరిందని పీజేపీ అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం నుంచి ప్రతి గంటకు ఇన్ ఫ్లో పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు 27గేట్లు ద్వారా 1, 03, 754 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్