జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారిని ఆదివారం బిజెపి సీనియర్ నాయకులు, మెదక్ ఎంపీ రఘునందన్ రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి ఎంపీ రఘునందన్ రావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.