జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఛైర్మన్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి గంటా కవితా దేవి శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి సూపర్డెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజిస్టర్ లో 38మంది డాక్టర్ల పేర్లు ఉండగా ఆసుపత్రిలో ఒకరే ఉండడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాగైతే ప్రజలకు వైద్యం ఎలా అందుతుందని మండిపడ్డారు. ఈ పద్ధతి మార్చుకోవాలని జడ్జి హెచ్చరించారు.