అయిజ మున్సిపాలిటీలోని 15వార్డులో తమ ఇంటి ఆవరణలో ఉన్న డ్రైనేజి సమస్యను పరిష్కరించాలని స్థానికులు వాపోతున్నారు. ఇంటి ఆవరణలో చెట్ల కంపలు ఉండడంతో, రోడ్డుపై బురదనీరు చేరుతుండడంతో పందులు తమ ఇంటి ఆవరణలోకి వస్తున్నాయన్నారు. దీంతో చిన్న పిల్లలు, వృద్దులు తీవ్ర అనారోగ్యానికి గురౌతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు తమ సమస్యలను పరిష్కరించాలని హెచ్చరించారు.