కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం గేట్లు తెరవడంతో తుంగభద్ర నదికి వరద పోటెత్తింది. రాజోలి మండల కేంద్రం సమీపంలోని సుంకేసుల బ్యారేజీకి శనివారం సాయంత్రం ఇన్ ఫ్లో 72 వేల క్యూసెక్కులు వస్తోంది. దీంతో బ్యారేజీ 19 గేట్లు ఒక మీటరు మేర ఎత్తి దిగువకు 74, 423 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నదీ తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు