బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మృతి

3631చూసినవారు
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మృతి
జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బొంకూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బొంకూరు గోపాల్ రెడ్డి (55) శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు. గత కొన్నేళ్ల నుంచి ఈ ప్రాంతంలో సుపరిచితులుగా ఉన్న గోపాల్ రెడ్డి ఉన్నట్టుండి శ్వాస వదలడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఆయన మృతికి పార్టీ నాయకులు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.

సంబంధిత పోస్ట్