మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జి సరిత మాట్లాడుతూ అందరి ఆదర్శప్రాయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని స్వాతంత్య్రం కోసం తన ప్రాణాన్ని అర్పించిన గాంధీ జయంతిని స్ఫూర్తివంతంగా జరపాల్సిన అవసరం ఉందని అహింస మార్గంలో దేశానికి స్వేచ్ఛను అందించారన్నారు.