జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గంలోని ఐజ మండలానికి చెందిన దేవబండ గ్రామస్తుడు బోయ కాకి గోపాల్ తన పొలంలో షెడ్ వేసుకొని ఎనిమిది పొట్టేలతో జీవనం సాగిస్తున్నాడు. శనివారం రాత్రి గుర్తు తెలియని దొంగలు షెడ్ వెనక భాగం నుంచి చొరబడి పొట్టేలు ఎత్తుకెళ్లారు. అప్పటికి షెడ్‌లో ఉన్న సీసీ కెమెరా పనిచేయలేదు. గోపాల్ పొలాల్లో వెతికినా ఉపయోగం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.