గద్వాల: పాప మృతి.. ఆస్పత్రి ముందు కుటుంబ సభ్యుల ఆందోళన

53చూసినవారు
గద్వాల: పాప మృతి.. ఆస్పత్రి ముందు కుటుంబ సభ్యుల ఆందోళన
గద్వాల జిల్లా రేవులపల్లికి చెందిన అశ్విని ఆనంద్ దంపతుల 3 నెలల పాపకు ఆస్తమాతో ఇబ్బంది పడుతుంది. వైద్యం కోసం గురువారం రాత్రి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స అందించిన వైద్యులు శుక్రవారం కర్నూల్ తీసుకెళ్లాలని సూచించారు. కర్నూల్ ఆసుపత్రికి తీసుకెళ్లగా పాప మృతి చెందింది. పాప మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని గద్వాల ప్రైవేట్ ఆస్పత్రిలో శనివారం కుటుంబ సభ్యుల ఆందోళన చేపట్టారు.

సంబంధిత పోస్ట్