జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ మల్టిపుల్ డైరెక్టర్ మేడిశెట్టి రామకృష్ణ, ఇంచార్జ్ డిస్ట్రిక్ట్ జిపి ప్రవీణ్, ఆర్ సి కండి కృష్ణ, రీజనల్ సెక్రటరీ గోటూర్ వెంకటేష్, ప్రెసిడెంట్ లగిశెట్టి చంద్రశేఖర్, సెక్రటరీ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.