మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి గ్రామ శివారులోని జాతీయ రహదారి(44)పై బంగారు మైసమ్మ ఆలయం సమీపంలో రోడ్డుపై శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల పోలీసులకు సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చూపెట్టారు. మృతునికి సంబంధించిన ఎవరైనా తమ వారు ఉంటే లేదా ఎవరికైనా అతని గురించిన సమాచారం తెలిస్తే రాజాపూర్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.