డిగ్రీ కళాశాలల ప్రవేశాలకు దరఖాస్తులు

57చూసినవారు
డిగ్రీ కళాశాలల ప్రవేశాలకు దరఖాస్తులు
పీయూ పరిధిలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలుర డిగ్రీ కళాశాలలు (నాగర్ కర్నూల్, నారాయణపేట, దేవరకద్ర), మహిళా డిగ్రీ కళాశాల (గద్వాల)లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బుధవారం మహబూబ్ నగర్ ఆర్సీఓ వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ నెల 11న (గురువారం) సర్టిఫికెట్లతో నాగర్ కర్నూల్ ఉయ్యాలవాడలోని బీసీ గురుకుల జూనియర్ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కోర్సులు ఆంగ్ల మాధ్యమంలో ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్