మహబూబ్ నగర్ పట్టణంలోని శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ఆరాధన మహోత్సవాలను పురస్కరించుకుని 16, 17న (గురు, శుక్రవారం) భజన పోటీలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ బాధ్యులు నారాయణ తెలిపారు. 16న హన్వాడ, భూత్పూర్, మహమ్మదాబాద్, జడ్చర్ల, కోయిలకొండ, నవాబుపేట, దేవరకద్ర మండలాల పరిధిలోని భజన సంఘాలు పాల్గొనాలని 17న మహబూబ్ నగర్ మండల స్థాయిలో పోటీలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఉత్తమ భజన బృందాలకు బహుమతులు అందిస్తామన్నారు.