జడ్చర్లలో తాళం వేసిన ఇంట్లో చోరీ

83చూసినవారు
జడ్చర్లలో తాళం వేసిన ఇంట్లో చోరీ
తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడిన ఘటన జడ్చర్లలో మంగళవారం వెలుగు చూసింది. జడ్చర్ల పట్టణం రంగారావుతోట కు చెందిన విష్ణుచారి సోమవారం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి వెళ్లారు. మంగళవారం ఉదయం వచ్చి చూడగా తాళం పగల గొట్టి ఉంది. ఎల్ఈడీ టీవీ, 40 తులాల బంగారు ఆభరణాలు లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్