మిడ్జిల్ ఆసుపత్రిలో కలెక్టర్ విజయేంద్ర తనిఖీలు

56చూసినవారు
జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండల కేంద్రంలో మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి బుధవారం పర్యటించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. వైద్యం కోసం వచ్చిన వారితో మాట్లాడుతూ. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అనంతరం కస్తూర్బా పాఠశాలను సందర్శించి అక్కడ నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్