ప్రియురాలితో ఎంపీడీవోను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భార్య
నెల్లూరు జిల్లాలో ఎంపీడీవోగా పని చేస్తున్న అధికారి ఒకరు గత సార్వత్రిక ఎన్నికల సమయంలో బదిలీపై చిత్తూరు జిల్లాకు వెళ్లారు. అక్కడ ఆయనకు ఏఎన్ఎం ఒకరు పరిచయమయ్యారు. ఆమెతో ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి ఆయన భార్యాపిల్లల్ని పట్టించుకోవడం మానేశారు. దాంతో భార్యాపిల్లలు ఎంపీడీవో కదలికలపై నిఘా పెట్టారు. ఒంగోలులోని ఒక లాడ్జీలో ఉన్నట్లు గుర్తించిన భార్యాపిల్లలు అక్కడికి చేరుకున్నారు. ఎంపీడీవో, ఆయన ప్రియురాలిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఘర్షణ తలెత్తింది.