ఇప్పపహాడ్ లో ఆవు దూడ మృతి

67చూసినవారు
ఇప్పపహాడ్ లో ఆవు దూడ మృతి
జడ్చర్ల నియోజకవర్గం ఉర్కొండ మండలం ఇప్పపహాడ్ లో గుర్తు తెలియని అడవి జంతువు దాడిలో ఓ ఆవు దూడ మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం. గ్రామానికి చెందిన కొమ్మ గోని రాములు పొలంలో గుర్తుతెలియని అడవి జంతువు దాడి చేసి ఆవు దూడను చంపేసింది. గత 15 రోజుల్లో నాలుగు దూడలు మృతి చెందడంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. అధికారులు స్పందించి అడవి జంతువులపై నిఘా పెట్టాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్