మున్సిపల్ కార్యాలయం ఎదుట కౌన్సిలర్ల ధర్నా

81చూసినవారు
మున్సిపల్ కార్యాలయం ఎదుట కౌన్సిలర్ల ధర్నా
జడ్చర్ల మున్సిపల్ కార్యాలయంలో ఛైర్ పర్సన్ దిరేపల్లీ లక్ష్మీ, కమిషనర్ రాజయ్యతో కలసి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారనీ ఆరోపిస్తూ కౌన్సిలర్లు శనివారం ధర్నా చేపట్టి సమావేశ ఎజెండా చించేశారు. వారు మాట్లాడుతూ. అవినీతికి పాల్పడుతున్న ఛైర్ పర్సన్ కు సహకరిస్తున్న కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. అవిశ్వాసం పెట్టేందుకు కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ ను కలిసేందుకు వెళ్తునున్నట్లు ప్రకటించారు

సంబంధిత పోస్ట్