మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాల కిష్టారెడ్డి, లారీ డ్రైవర్ మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. పెద్దాయపల్లి చౌరస్తాలో లారీ వేగంగా వెళ్తూ బాల కిష్టారెడ్డి కారు ముందు హారన్ కొట్టడంతో ఇబ్బందులు పడ్డారు. దీంతో ఆయన బాలానగర్ మండల కేంద్రం వద్ద లారీని నిలిపి డ్రైవర్ ను నిలదీశాడు. స్థానికులు ఇరువురిని శాంతింపజేశారు.