రక్తదానం ఎంతో గొప్పదానమని మహబూబ్ నగర్ ఐఆర్సీఎస్ ఛైర్మన్ లయన్ నటరాజ్ అన్నారు. శనివారం హైదరాబాదు మాదాపూర్ లో మైక్రాన్ టెక్నాలజీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆయన పాల్గొన్నారు. తలసేమియా బాధితులు సజీవంగా ఉండాలంటే వారు నిత్యం రక్తాన్ని మార్చుకోవాల్సి ఉంటుందని అటువంటి వారి కోసం మనం దానం ఇచ్చిన రక్తం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన మైక్రాన్ సంస్థ ఉద్యోగులను ఆయన అభినందించారు.