మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో గురువారం గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి హాజరై మాట్లాడుతూ. సమాజంలో గురువుల స్థానం మరువలేనిదని, విద్యార్థుల మంచి భవిష్యత్తుకు గురువును నిరంతరం కృషి చేస్తారని, వారు చెప్పే నీతి పాఠాలు, వాక్యాలు పాటించిన వారు ఉజ్వల భవిష్యత్తు కలిగి ఉంటారన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.