తెలంగాణ ప్రభుత్వం చేస్తూన్న సమగ్ర కుటుంబ సర్వే దేని కోసమో ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని మహబూబ్ నగర్ ఎంపి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. మేరకు గురువారం డీకే అరుణ మాట్లాడుతూ. ప్రభుత్వం రూపొందించిన ప్రశ్నావళి కులగణనకు విరుద్ధంగా ఉందన్నారు. ఆస్తులు, అప్పులు, భూములు, ఏ పార్టీ అనే విషయాలు అడుగుతున్నారని, అవన్నీ ప్రభుత్వానికి ఎందుకు చెప్పాలని ఆమె ప్రశ్నించారు.