పాలమూరులో భారీ వర్షం

71చూసినవారు
గత కొద్ది రోజులుగా ముఖం చాటేసిన వరుణుడు ఎట్టకేలకు కరుణించాడు. శనివారం సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలలో పెద్ద ఎత్తున నీరు చేరుకుంది. రూరల్ మండల పరిధిలో కూడా భారీ వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా వర్షం కురువకపోవడంతో విత్తనాలు వేసిన రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్