గోల్కొండ కోటను జయించిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని మహబూబ్ నగర్ మాజీ, ఎమ్మెల్యే మాజీ మంత్రి డా. వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం హైదరాబాద్ అంబర్ పేటలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేదల కోసం పోరాడని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కాలేరు, వెంకటేష్ పాల్గొన్నారు.