మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని బోడ జానంపేట వద్ద బుధవారం దుందుభి నది పరవళ్ళు తొక్కుతోంది. ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పెద్దయపల్లి, అమ్మపల్లి, బాలానగర్, ఉడిత్యాల, నందారం తదితర గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. వేరుశనగ, వరి, మొక్కజొన్న, జొన్న ఇతర ఆరుతడి పంటల సాగుకు అనుకూలంగా ఉంటుందన్నారు.