జడ్చర్ల: బావిలో దూకి ఓ మహిళ ఆత్మహత్య

79చూసినవారు
బావిలో దూకి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం. జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలం బోయిన్ పల్లికి చెందిన కుమ్మరి కిష్టమ్మ గ్రామ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మహిళను శనివారం రెస్క్యూ టీం సుమారు రెండు గంటలు పైగా శ్రమించి మృతదేహాన్ని వెలికితీశారు. మృతురాలికి భర్త కుమ్మరి లింగం, ఒక కుమారుడు ఉన్నట్లు సమాచారం. మహిళ మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్