జడ్చర్ల: ఘనంగా బొడ్రాయి ఉత్సవాలు

55చూసినవారు
జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలం దోనూర్ లో బుధవారం బొడ్రాయి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంత్రం బొడ్రాయి పండగ పురస్కరించుకొని బోనాలను వైభవంగా ఊరేగింపు చేశారు. డప్పు వాయిదాలతో పూనకాల నృత్యాలతో బొడ్రాయి వద్దకు చేరుకుని నైవేద్యాలు సమర్పించారు. ప్రతి ఏటా బోనాలు నిర్వహిస్తామని గ్రామస్థులు తెలిపారు. బోనాలకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు, బంధువులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్