అదుపుతప్పి జాతీయ రహదారిపై కారు బోల్తా పడిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం. హైదరాబాద్ నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి ఇనుప డివైడర్ కు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారును క్రేన్ సహాయంతో తొలగించారు. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.